FbTelugu

తెలంగాణలో తప్పుడు లెక్కలు: న్యూ డెమోక్రసీ

ఖమ్మం: కరోనా పాజిటివ్ కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని, అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు.
తెలంగాణ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 19 మంది మరణించినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారని, ఒక్క ఖమ్మం జిల్లాలోనే 22 మంది చనిపోయారన్నారు.

ఇలా తొమ్మిది జిల్లాల్లో లెక్క వేస్తే మొత్తం మరణాలు మూడు వందలకు పైగానే ఉండవచ్చన్నారు. ప్రభుత్వం కరోనా మరణాలను దాచి చేతకాని తనాన్ని బయపెట్టుకుంటున్నదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలముందు పెట్టాలని, ఏ జిల్లాలో ఎంత మంది చనిపోతున్నారనేది స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదని, వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రంగారావు డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.