FbTelugu

తిరుమల దర్శించుకున్న నూతన సిజెఐ

తిరుమల: సుప్రీంకోర్టు కు కాబోయే ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ దంపతులు ఇవాళ ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
రంగనాయకుల మంటపం వద్ద రమణ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.

స్వామి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి శేష వస్త్రాన్ని అందచేశారు. అంతకు ముందు శ్రీవారి ఆలయం చేరుకున్న రమణ దంపతులకు టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజ స్థంభానికి నమస్కరించిన తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.