న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చితే రోజువారీగా నమోదౌతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దేశంలో నిన్న ఒక్క రోజే కొత్తగా 20,021 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. అదే సమయంలో కరోనాతో 279 మంది మృత్యువాత పడగా.. 21,131 మంది కోలుకున్నారు.
తాజా కేసులతో దేశంలో మొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,07,871 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,47,901 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో 97,82,669 మంది కోలుకోగా.. ప్రస్తుతం 2,77,301 యాక్టీవ్ కేసులున్నాయి.