FbTelugu

గవర్నర్ ను కలిసిన నూతన ఎస్ఈసి

విజయవాడ: మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియంతో నీలం సాహ్నిని నియమించిన విషయం తెలిసిందే.

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలిపారు. ఆ తరువాత ఆమె రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసి పూల మొక్కను అందచేశారు. నూతన కమిషనర్ గా ఇవాళే పదవీ బాధ్యతలు స్వీకరించినట్లు గవర్నర్ కు తెలిపారు. ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంఘం కార్యకలాపాలను నీలం సాహ్ని వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.