FbTelugu

చైనా ఆన్ లైన్ కంపెనీల కేసులో కొత్త కోణాలు

న్యూఢిల్లీ: చైనా ఆన్ లైన్ బెట్టింగ్ కంపెనీల కేసుపై సీసీఎస్ పోలీసుల విచారణలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. కంపెనీలలో డైరెక్టర్లుగా.. భారత్ కు చెందిన చిరు వ్యాపారులు ఉన్నట్టుగా గుర్తించారు.

ఢిల్లీ గుర్గాన్ కు చెందిన ఛాయ్ వాలా, ఇస్త్రీ వాలా, మెకానిక్ లను డైరెక్టర్లుగా చూపుతూ.. వ్యాపారం నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. డాకీపే, లింక్ యూ కంపెనీతో పాటూ.. 30 కంపెనీల్లో డైరెక్టర్లుగా చిరువ్యాపారులే ఉన్నట్టు గుర్తించారు. సుమారు రూ.2 వేల కోట్లకు చైనా ఆన్ లైన్ బెట్టింగ్ మోసాలు చేరినట్టుగా గుర్తించారు.

You might also like