FbTelugu

మమత లాంటి సిఎం ను చూడలేదు: అమిత్ షా

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ లాంటి రాజకీయ నాయకురాలిని తాను ఇంత వరకు జీవితంలో చూడలేదని, చూడను కూడా అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్  ఘాటుగా వ్యాఖ్యానించారు.

కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలని మమత వ్యాఖ్యానించడంపై అమిత్ షా మండిపడ్డారు. ప్రజలను అరాచకం వైపు నెట్టివేస్తున్నారా అని ఆయన ఎద్దేవా చేశారు. అయితే మమత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఒకసారి జారీ చేయగా తాజాగా మరోసారి నోటీసులు పంపించింది. శనివారం ఉదయం 11 గంటలలోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ఇంకా పది నోటీసులు ఇచ్చినా తన వైఖరిలో మార్పు లేదని మమత తేల్చి చెప్పారు. మతాల ప్రాతిపదికన ఓటర్లను విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాను మాట్లాడుతునే ఉంటానని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.