FbTelugu

వారు చనిపోయినా పర్వాలేదా ?: ఉత్తమ్

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలు చనిపోయినా పర్వాలేదని భావిస్తున్నాయా ? అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా సర్వస్వం కోల్పోయిన వలస కూలీల సమస్యలు పరిష్కరించి, వారిని స్వస్థలాలకు పంపడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ముందు చూపు లేకుండా లాక్ డౌన్ విధించిందని అన్నారు. వలస కార్మికుల వ్యవహారం ఆర్మీకి అప్పగించినా బావుండేదని అన్నారు.

You might also like