FbTelugu

సౌరభ్ ను ఆడుకున్న నెటిజన్లు… పోస్టు డిలీట్!

ముంబయి: బిసిసిఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీని నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో రేసింగ్ కార్లపై కామెంట్లు పెట్టే సమయముందా అంటూ ఆయనపై మండిపడ్డారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన తన పోస్టును తొలగించారు.

సౌరభ్ గంగూలీ శనివారం దుబాయ్ ఆటో డ్రోమ్ ను సందర్శించారు. అక్కడ రేసింగ్ లో పాల్గొని ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. రేసు కారు నడిపాను కాని అందులో నుంచి భరించలేని విధంగా వేడి వచ్చిందంటూ కామెంట్ జత చేశాడు. ఈ ఫొటోలను చూసిన అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. సెకండ్ వేవ్ తో ప్రజలు బాధపడుతుంటే ఇలాంటి పోస్టులు అవసరమా అని ప్రశ్నించారు. దీని వల్ల నీకు ఉపయోగం తప్ప ఎవరికీ ఉండదు. సమాజం కోసం ఏదైనా మంచి పని చేయి, అప్పుడు అభినందిస్తామని మరో నెటిజన్ స్పందించాడు. ఇటీవలే కదా మీకు గుండె బైపాస్ సర్జరీ జరిగింది, ఆరోగ్యం కాపాడుకోకుండా రేసు కార్లు ఎక్కుతావా అంటూ మరికొందరు నెటిజన్లు ఘాటుగా రిప్లై పెట్టారు. ఈ కామెంట్లను చూసిన గంగూలీకి చిరాకెత్తి వెంటనే తన పోస్టును తొలగించి ఊపిరిపీల్చుకున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.