FbTelugu

మయూర్ పై నెటిజన్ల ప్రశంసలు

ముంబయి: చావు అంచు వరకు వెళ్లిన బుడ్డోడిని కాపాడిన రైల్వే పాయింట్స్ మెన్ మయూర్ షెల్కే మరోసారి తన ఔదార్యాన్ని చాటుకుని శెహబాష్ అనిపించుకున్నారు. ఆ రైల్వే ఉద్యోగి పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మయూర్ తన ప్రాణాలకు తెగించి థానే జిల్లాలోని వంగాని స్టేషన్ లో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి పట్టాలపై పడిన చిన్నారిని కాపాడాడు. బాలుడిని రక్షించినందుకు రైల్వే శాఖ ఆయనకు రూ.50వేల నగదు బహుమతి అందచేసింది. ఆ మొత్తంలో సగం అనగా రూ.25వేలు ఆ బాలుడికే అందచేస్తానని మయూర్ ప్రకటించాడు. బాలుడి సంక్షేమం, విద్య కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుందని తెలిపాడు. ప్రాణాలు కాపాడ్డమే కాకుండా తనకు వచ్చిన నగదు బహుమతిలో సగం కేటాయించడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. సమాజంలో ఇప్పటికీ మయూర్ షెల్కే లాంటి వ్యక్తులు ఉండడం మానవత్వానిక గీటు రాయని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.