FbTelugu

కొత్త వివాదానికి తెరతీసిన నేపాల్

ఖాట్మండు: భారత్-నేపాల్ సరిహద్దు భూభాగం విషయంలో మరో కొత్త వివాదానికి నేపాల్ తెరతీసింది. సరిహద్దును సవరిస్తూ కొత్త మ్యాప్ ను రూపొందించింది. ఇది ఒక ఎత్తయితే ఇలా కొత్తగా రూపొందించిన భౌగోళిక మ్యాప్ ను నేపాల్ పార్లమెంట్ ఆమోదించింది.

ఈ మ్యాప్ లో ఉత్తరాఖండ్ లోని మూడు భారత భూభాగాలు (కాలాపానీ, లిపులేక్, లింపియాదుర) తమ భూభాగంలో ఉన్నట్టుగా మ్యాప్ ను రూపొందించింది. ఈ చర్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ ఘాటుగానే వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.

You might also like