FbTelugu

10 వేలకు చేరువవుతున్న నెల్లూరు

నెల్లూరు: పరీక్షలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు 500 పై చిలుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

గడచిన 24 గంటల్లో కొత్తగా 559 మందికి పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్ఓ) ప్రకటించారు. శనివారం సాయంత్రం బులెటిన్ ను విడుదల చేశారు. కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసులతో కలిసి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 8578 కి చేరాయని  తెలిపారు. ఆక్టివ్ కేసులు 5783 ఉండగా, ఇప్పటి వరకూ వ్యాధి నుండి పూర్తిగా కోలుకుని 2795 మంది డిశ్చార్జ్ అయినట్లు డీఎంహెచ్ఓ వెల్లడించారు.

You might also like