FbTelugu

బిల్లులను వెనక్కి తీసుకుంటేనే చర్చలు: బాదల్

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకునే వరకు చర్చలు జరిపే ప్రసక్తి లేదని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షులు సుఖ్ బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు.
పంజాబ్ లో తమ పార్టీ రైతుల అనుకూల, పక్షపాత పార్టీ అని, రైతులు చేసే పోరాటానికి ఎప్పుడూ మద్దతుగా ఉంటామని అన్నారు. వ్యవసాయ బిల్లులపై ఒకటి రెండు రోజుల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో చర్చిస్తామని ఆయన తెలిపారు. రైతుల తరఫున ఈ బిల్లుపై పోరాటం చేస్తామని బాదల్ ప్రకటించారు.

కేంద్రం బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత చర్చలకు వెళ్తామని, అప్పటి వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. మరో నేత మంజిందర్ సింగ్ మాట్లాడుతూ, వ్యవసాయ బిల్లులపై పార్టీ నిర్ణయం సముచితంగా ఉందన్నారు. పార్లమెంటులో రైతులకు మద్ధతుగా మాట్లాడిన సుఖ్ బీర్ సింగ్ బాదల్, హర్ సిమ్రత్ కౌర్ లను ఆయన అభినందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.