FbTelugu

7వ సారి చర్చలు విఫలం

* తదుపరి ఉద్యమ కార్యచరణపై నేడు రైతుల చర్చలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలేవీ సఫలం కాలేదు. తాజాగా నిన్న కేంద్ర ప్రభుత్వంతో రైతుసంఘాల నేతలు 7వ సారి జరిపిన చర్చలూ విఫలమైనాయి.

ఓ పక్క తాము తీసుకువచ్చిన కొత్త చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గక పోవడం, రైతులు చట్టాలను పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తుండడంతో చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. దీంతో తదుపరి ఉద్యమ కార్యచరణపై నేడు రైతు సంఘాల నేతలు మరోమారు చర్చలు జరపనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.