FbTelugu

గాంధీలో కరోనా పేషెంట్ హల్ చల్

హైదరాబాద్: కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి తనకు నెగటివ్ వచ్చినా తనను ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ చేయడం లేదంటూ డాక్టర్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. సూర్యాపేటకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చేరాడు.

అయితే అతనికి 14 రోజులు చికిత్స అందించి పలుమార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ అతన్ని డిశ్చార్జ్ చేయలేదు. అతనికంటే తర్వాత వచ్చిన వారిని 15 రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తున్నారని.. తనను మాత్రం నెలరోజులైనా డిశ్చార్జ్ మాత్రం చేయడం లేదని వైద్యులతో వాగ్వాదానికి దిగాడు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే తాము అలా చేస్తున్నట్టు వేద్యులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.