FbTelugu

నూతన ఎన్నికల కమిషనర్ గా నీలం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకం పూర్తయింది. ఈ నియామకానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ నీలం నియామకానికి ఆమోదముద్ర వేశారు.

ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెలాఖరుతో రిటైర్మెంట్ కానున్నారు. ఆయన స్థానంలో ముగ్గురి ఐఏఎస్ అధికారులు శామ్యూల్, నీలం సాహ్ని, ఎల్.ప్రేమ్ చంద్రారెడ్డి పేర్లను సిఫారసు చేశారు. ముగ్గురి పేర్లలో నీలం సాహ్ని నియామకానికి గవర్నర్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. నీలం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తరువాత ఆమెను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా సిఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి నియమించారు. నూతన ఎన్నికల కమిషనర్ నియామకంతో నీలం ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవికి రాజీనామా చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.