FbTelugu

ఎన్నికలకు ముందే నెచ్చెలి మువీ: ఆర్జీవీ

హైదరాబాద్: ప్రముఖ వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఎన్నో సంచలనాల సినిమాలు తీశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదలు దిశ వరకు అనేక సినిమాలు తీశారు.
ఇప్పుడు ఆయన దృష్టి మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ పై దృష్టి పడింది. అవినీతి కేసుల్లో పీకల్లోతు ఇరుక్కుని జైలు ఊచలు లెక్కబెడుతున్న శశికళ పై బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికలకు ముందే ఈ సినిమాను రిలీజు చేస్తానని ప్రకటించడం విశేషం.

వాస్తవానికి ఈ సినిమా చేస్తున్నట్లు వర్మ గతేడాది ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. లవ్ ఈజ్ డేంజరస్ లీ పొలిటికల్ అన్న టైటిల్ తో పోస్టర్ కూడా విడుదల చేశారు. ఏమైందో ఏమో కాని ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి శశికళ సినిమాను వర్మ ప్రస్తావిస్తూ, జే, ఎస్, ఈ, పీ, ఎస్ మధ్య ఉన్న బంధాన్ని, వారి రాజకీయ తెరంగేట్రాన్ని చూపించబోతున్నారు. తమిళనాడు ఎన్నికల కన్నా ముందు, నాయకురాలి (జయలలిత) బయోపిక్ తలైవి రిలీజు అయ్యే రోజునే శశికళ చిత్రాన్ని కూడా విడుదల చేస్తామని వర్మ ప్రకటించారు.
ఈ మేరకు ఆయన జయ, నెచ్చెలి శశికళ ఫొటోను ట్వట్ చేశారు. ఈ చిత్రాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేశ్ రెడ్డి నిర్మిస్తుండగా, వర్మ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.