FbTelugu

ఇజ్రాయెల్ తొక్కిసలాటలో 44 మంది మృతి

జెరూసలెం: కరోనా మహమ్మారి సమయంలో ఇజ్రాయెల్‌లో ఘోర విషాదం సంభవించింది. మౌంట్‌ మెరెన్‌ పవిత్ర స్థలం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా లాగ్‌ బౌమర్ పండగ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు వేలాది మంది యూదులు ప్రముఖ రబ్బి షిమన్ బార్ యోచాయి సమాధి వద్దకు చేరారు. ఈ సమయంలో మౌంట్ మెరెన్‌లోని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఏదో భారీ ప్రమాదం జరగిందని భావించిన పలువురు ఒకరిమీద ఒకరు పడి తోసుకోవడంతో 44 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీని గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబూలెన్స్ లలో సమీప ఆసుపత్రులకు తరలించారు.

జనం భారీ ఎత్తున వస్తారని భావించిన ప్రభుత్వం గతేడాది కారోనా కారణంగా మూసివేసింది. వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తి కావడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున జనం రావడం, ప్రమాదం జరగడంతో తొక్కిసలాట జరిగింది. పరిమితికి మూడింతలు జనం రావడంతో ప్రమాదం సంభవించిందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బెంజమిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.