FbTelugu

ఆర్థిక వృద్ధి మరింత క్షీణిస్తుంది: మూడీస్

ndias-economic-growth-slows-further-Moodys

అంతర్జాతీయంగా ఏర్పడిన మందగమనం కారణంగా భారత వృద్ధి మరింత క్షీణించనున్నట్టు ‘మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్సీస్‌’ అంచనావేసింది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా.. భారత్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను తగ్గించింది. ఇప్పటి వరకు స్థిరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతం ‘నెగటివ్‌’కి చేర్చింది. వాణిజ్య పెట్టుబడులు పెంచే, వృద్ధిని పెంచే సంస్కరణల అవకాశాలు తగ్గిపోయాయని తెలిపింది. కాగా.. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ దేశంలో అలాంటి పరిస్థితులు ఏం లేవని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని తెలిపింది. ఇతర దేశాలతో పోల్చితే.. భారత్‌ మెరుగ్గానే ఉందని స్పష్టంచేశారు.

You might also like