FbTelugu

ఎన్సీపీ నేత శరద్ ‌కు తప్పిన ప్రమాదం

ముంబయి: ఎన్సీపీనేత శరద్ పవార్‌ కాన్వాయ్ లో ఓ కారు బోల్తాపడి పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళితే.. ఇవాళ శరత్ పవార్ కాన్వాయ్ ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై వెళుతుండగా.. కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తాపడింది.

అయితే అప్పటికే శరత్ పవార్ ఉన్న కారు ముందుకి వెళ్లడంతో అతనికి పెను ప్రమాదం తప్పినట్టైంది. బోల్తాపడిన కారులోని డ్రైవర్ కు స్వల్పగాయాలైనాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీలుసు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.