FbTelugu

విపక్షాలను కూడగడుతున్నాం: ఎన్.సి.పి నేత మాలిక

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎన్.సి.పి నేత శరద్ పవార్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం దేశంలోని విపక్ష పార్టీ నేతలతో సమావేశం జరుగుతుందని ఆ పార్టీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు.

ఈ సమావేశానికి ఆర్జెడి, టిఎంసి, ఆమ్ ఆద్మీ పార్టీ తో పాటు తమ పార్టీ నేతలు హాజరవుతున్నారన్నారు. దేశంలోని రాజకీయ పార్టీల పరిస్థితులు, బిజెపి ప్రభుత్వ పాలన, కరోనా నియంత్రణ, లోక్ సభ సమావేశాలపై చర్చించనున్నారని ఆయన వివరించారు. దేశంలోని అన్ని విపక్ష పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు మంగళవారం నుంచి శరద్ పవార్ పనిచేస్తారన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోమవారం నాడు శరద్ పవార్ ను కలిశారని, అంతకు ముందు పది రోజుల క్రితం కూడా భేటీ అయ్యారన్నారు. భవిష్యత్తులో జాతీయ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది పికె కు బాగా తెలుసనని, బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాల్సిన సమయం ఆసన్నమైందని నవాబ్ మాలిక్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.