FbTelugu

కంగన కోసం టైమిస్తారు.. రైతులకివ్వరా?: పవార్

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. నిన్న రైతులు గవర్నర్ ను కలవడానికి వెళ్లగా.. అపాయింట్ మెంట్ ఇవ్వక పోవడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నటి కంగన రనౌత్ ను కలిసే సమయం ఉంది కాని రైతులను కలిసేందుకు సమయం లేదా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేంకగా రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న దేశ వ్యాప్తంగా రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.