FbTelugu

నయనతార, విఘ్నేశ్ ఎంగేజ్ మెంట్ అయ్యిందా…

కొంత కాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్న సినిమా తారలు నయనతార, విఫ్నేశ్ శివన్ త్వరలో ఒకటి కాబోతున్నారు. విఘ్నేశ్ గురువారం ఒక ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో మరింత బలపడింది.

ఆ ఫొటోలో నయనతార చేయి అతడి గుండెల మీద ఉండగా, ఆమె వేలికి బంగారు రింగ్ తొడిగి ఉంది. ఈ ఫొటో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. 2015లో నానుమ్ రౌడిదాన్ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలోపడ్డారు. విఘ్నేశ్ ప్రస్తుతం కాతువాకుకల రెండు కాదల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయత్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.