FbTelugu

ఆమెలో అది నచ్చిందంటున్న ప్రియుడు

కొన్నాళ్లుగా కలిసి తిరుగుతూ, పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నటుల జంట నయనతార-విఘ్నేష్ శివన్. తమ అభిమాన నటీనటుడి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కరోనా మహమ్మారితో వాయిదా పడడం అభిమానులను నిరాశకు గురిచేసింది. లాక్ డౌన్ తో షూటింగ్ లు ఆగిపోవడం, బయట తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఇద్దరూ ఇంటికే పరిమితం అయ్యారు. వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లినా తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. విఘ్నేష్ తన అభిమానులతో కొద్ది సేపు ఛాటింగ్ చేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. నయనతారతో మీరు దిగిన ఫొటో, అందులో మీకు బాగా నచ్చిన ఫొటో ఏది అని ప్రశ్నించారు. ఆమెను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు. ఆ తరువాత మరొక నెటిజన్ ఆమెలో మీకు నచ్చిన లక్షణం ఏదని ప్రశ్నించగా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా నచ్చిందని విఘ్నేష్ చెప్పిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.