FbTelugu

 ఇంకా లభించని నవీన్ ఆచూకీ

హైదరాబాద్: సరూర్ నగర్ చెరువులో నిన్న సాయంత్రం గల్లంతైన నవీన్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దించారు.
అయినా నవీన్ ఆచూకీ ఇంకా లభించలేదు.

సరూర్ నగర్ చెరువులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. రెస్క్యూ ఆపరేషన్ కు బురద, చెత్తాచెదారం తీవ్ర ఆటంకంగా మారింది. గల్లంతైన వ్యక్తి అల్మాస్ గూడకి చెందిన నివాసిగా గుర్తించారు. ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్న నవీన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.