FbTelugu

ఫాస్టాగ్ తీపి కబురు

న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద సాఫీగా ప్రయాణం సాగేందుకు ఫాస్టాగ్ విధానం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫాస్టాగ్ వేసేందుకు ఇప్పటి వరకు ఛార్జీలు వసూలు చేయగా, మార్చి 1వ తేదీ వరకు ఉచితంగా అందించనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా ఉన్న 770 టోల్ ఫ్లాజాల వద్ద మార్చి 1వ తేదీ వరకు ఫాస్టాగ్ ఉచితంగా అందచేస్తారని, ఈ సౌకర్యాన్ని వాహనదారులు వినియోగించుకోవాలని కోరింది. దేశంలో ప్రస్తుతం 87 శాతం మంది ఇది వినియోగించుకుంటుండగా వంద శాతానికి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో 7 శాతం పెరిగి, ఒక్కరోజులో 63 లక్షల లావాదేవీలతో రూ.100 కోట్లు వసూలు అయ్యింది. ఉచితంగా అందచేయడం మూలంగా గత రెండు రోజుల్లోనే 2.5 లక్షల మంది యజమానులు ముందుకు వచ్చారని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.