FbTelugu

ఇజ్రాయెల్ ఫస్ట్… మాస్క్ రద్దు

జేరుసలేం: ఇజ్రాయెల్ దేశం ప్రపంచ చరిత్రలో చోటు సంపాధించుకున్నది. తొలి మాస్క్ రహిత దేశంగా చరిత్రలో నిలిచిపోనున్నది. ఈ నెల 15వ తేదీ నుంచి మాస్క్ లేకుండా దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ దేశ ఆరోగ్య మంత్రి యులి ఎడెల్స్ టెయిన్ అధికారికంగా ప్రకటించారు.

కరోనా వైరస్ పై ఆ దేశ వాసులు సమిష్టి విజయం సాధించారు. గత ఏడాది డిసెంబర్ 20 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా వంద శాతం పూర్తి చేశారు. వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో జూన్ 1వ తేదీ నుంచి గుంపులుగా ఉండడం, భౌతిక దూరం పాటించే నిబంధనలు పూర్తిగా ఎత్తేశారు. ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా సాగుతుండడంతో విదేశీ ప్రయాణీకులపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. తమ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లడంపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అయితే తొమ్మిది దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల విషయంలో నిర్భంధ నియమమం అమలులో ఉంది. కరోనా పరీక్షలు నిర్వహించిన తరువాతే తిరిగేందుకు అనుమతిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.