FbTelugu

ముక్కులో వేసే వ్యాక్సిన్ రెడీ: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లపై కేంద్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని, మరో వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ దశలో ఉందన్నారు.
రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు జితేంద్ర సింగ్ సమాధానం చెప్పారు. కాడిల్లా హెల్త్ కేర్ డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ మూడో దశలో ఉందని, అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు కూడా చేసిందన్నారు.

హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉందని అన్నారు. అలాగే భారత్ బయోటెక్ తయారు చేసిన ముక్కులో వేసే వ్యాక్సిన్ కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయని ఆయన వివరించారు. ఇవే కాకుండా జెన్నోవా బయో ఫార్మా వ్యాక్సిన్ తొలి దశలో, జెనిక్ లైఫ్ సైన్సెస్ వ్యాక్సిన్ అడ్వాన్సుడు ప్రీ క్లినికల్ స్టేజిలో ఉందన్నారు. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని జితేంద్ర సింగ్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.