FbTelugu

నరేంద్ర మోదీ మరో రికార్డు సొంతం

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశంలో కాంగ్రేసేతర ప్రధాన మంత్రిగా అత్యధిక రోజులు పనిచేసిన ఘనతను మోదీ దక్కించుకున్నారు.
పూర్వ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ ల తరువాత అత్యధిక రోజులు ప్రధానిగా కొనసాగిన చరిత్రను మోదీ సొంతం చేసుకున్నారు. నరేంద్ర మోదీ తొలిసారి 2014 మే 26వ తేదీన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి 2019 మే 30వ తేదీ బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెసేతర ప్రధానిగా పనిచేసిన అటల్ బిహారీ వాజపేయి 2268 రోజులు మాత్రమే చేయగా, మోదీ అది కూడా అధిగమించడం విశేషం.

దేశంలో అత్యధిక సంవత్సరాలు పనిచేసిన ఘనతను జవహర్ లాల్ నెహ్రూ దక్కించుకున్నారు. నెహ్రూ 17 సంవత్సరాలు పనిచేయగా, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ 16 సంవత్సరాలు కొనసాగారు. మన్మోహన్ సింగ్ రెండు విడతల్లో పది సంవత్సరాలు పనిచేశారు. ఈ ముగ్గురి తరువాత అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన ఖ్యాతిని మోదీ దక్కించుకున్నారు.

You might also like