FbTelugu

నారాయణ లో కంపు కంపు: కమిషన్ ఆగ్రహం

గుంటూరు: కార్పొరేట్ కాలేజీలుగా వెలుగొందుతున్న నారాయణ జూనియర్ కాలేజీలో కంపు రాజ్యమేలుతోంది. లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.
కుళ్లిపోయిన కూరగాయలతో వండిన కూరలను వడ్డిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. గుంటూరు శివారులో పెదపలకలూరు లో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీ హాస్టల్ క్యాంపస్ లో ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు పర్యటించారు. అక్కడున్న సౌకర్యాలు, నిర్వహణ చూసి విస్తుపోయారు. కిచెన్ లో చెత్త చెదారం నిండిపోవడం, కుళ్లి టమాటాలు, క్యాబేజీలతో వంటలు చేయడం, కుళ్లిన వాటిని బయట పడేయకుండా వాడడం ప్రత్యక్షంగా చూసి మండిపడ్డారు.

పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతూ కనీసం రుచికరమైన ఆహారాన్ని కూడా అందించలేరనా అని నిర్వహాకులను ప్రశ్నించారు. మీ ఇంట్లో మీ భార్యా, బిడ్డలకు ఇలాంటి ఆహారమే వడ్డిస్తారా అని నిలదీశారు. విద్యార్థులకు వారంలో ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వరా, ఏడు రోజుల పాట ఉదయం నుంచి రాత్రి వరకు తరగతుల పేరుతో వేధిస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తరువాత కమిషన్ సభ్యులు నారాయణ రెడ్డి, ప్రసాద్, ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. నారాయణ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తామని, స్పందించకపోతే మూసివేస్తామని వారు హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.