FbTelugu

నారప్ప టీజర్ వస్తోంది…

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా ఫ్యాక్షన్ నేపథ్యంలో మరో సినిమా రూపుదిద్దుకున్నది. సెకండ్ వేవ్ కారణంగా నారప్పతో పాటు ఎఫ్ 3, దృశ్యం 2 చిత్రాలు విడుదల ఆగిపోయింది.
ఈ చిత్రాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నారప్ప చిత్రాన్ని అడ్డాల శ్రీకాంత్ తెరకెక్కిస్తుండగా, దగ్గుబాటి సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు.

ఇందులో కథానాయకుడిగా వెంకటేష్, కథానాయికగా ప్రియమణి నటిస్తోంది. రామలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. సినిమాలో ఇవి హైలెట్ కానున్నట్లు సమాచారం. వచ్చే వారం టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ తో పాటు సినిమా రిలీజు డేట్ ను కూడా ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ రెండు విభిన్న పాత్రలలో కన్పించి ప్రేక్షకులను మెప్పించనున్నాడు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.