FbTelugu

 6 నెలల్లోనే ఘోర పతనం : లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృద్ధి కేవలం 6 నెలల్లోనే ఘోరంగా పతనమైందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఒంటి చేత్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వృద్ధిని తిరోగమనం పాలు చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ గ్రాఫ్ ను కూడా పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో ‘అప్పుడు, ఇప్పుడు’ అంటూ జీఎస్‌డీపీ, వ్యవసాయం, రాష్ట్ర బడ్జెట్, సేవలు వంటి రంగాల్లో వృద్ధి, తిరోగమనాన్ని సూచిస్తూ.. ఓ గ్రాఫ్ ను తన ట్వట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్ర జీఎస్ డీపీ దారుణంగా పతనమైందని ఆరోపించారు.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More