FbTelugu

రాజధాని మూడు ముక్కలాటా?: నారా లోకేష్..

అమరావతి: మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేసి మీ అవినీతి భాగస్వామికొకటి, మీ తప్పుడు పత్రిక నిర్వాహకునికి ఒకటి, మీ మామకొకటి ఇచ్చేసుకోడానికా అని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు ఎద్దేవా చేశారు.

అందుకేనా 29,881 మంది రైతులు రాజధాని అమరావతి కోసం త్యాగం చేసింది? అని లోకేష్ ట్వీట్ చేశారు. మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు, రైతు కూలీలు బలయ్యారు. వారి త్యాగాలను పణంగా పెట్టే మీ ఆటలు సాగనివ్వం. 200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా? అని నిలదీశారు.

రాష్ట్ర ప్రజలరా! ఇది రాజధాని రైతు సమస్య మాత్రమే కాదు. విధ్వంసకర పాలనకు, ప్రజా ద్రోహానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. అందుకే కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏకంకండి. “ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని” అంటూ అమరావతి కోసం ఉద్యమిద్దాం అని లోకేష్ పిలుపునిచ్చారు.

You might also like