FbTelugu

‘దొంగ పేపరు, దొంగ చానల్ ఓ దొంగబ్బాయ్’ : లోకేశ్

nara-lokesh-fires-on-ys-jaganmohan-reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వైసీపీపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి సాధించింది ఏమీ లేదని.. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించి, వారిని ఇబ్బందులకు మాత్రం గురి చేశాడని అన్నారు. దెందులూరు నియోజకవర్గాన్ని స్వంత నిధులతో అభివృద్ధి చేసిన చింతమనేని ప్రభాకర్ వంటి వ్యక్తులనున కూడా వదలడంలేదని, ఆయనను జైల్లో ఉంచి 51 రోజులైందని అన్నారు. మార్ఫింగ్ చేసిన వీడియోలు ఆధారంగా చేసుకుని ఎలా అరెస్ట్ చేస్తారంటూ లోకేశ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఓ దొంగ పేపరు, ఓ దొంగ చానల్ ఉన్నాయని, వాటిని పెట్టింది ఓ దొంగబ్బాయ్ అని పరోక్షంగా ఓ మీడియా సంస్థపై వ్యాఖ్యలు చేశారు. ఆ మీడియాలో వచ్చే వార్తలను మీరు ఎలా సాక్ష్యాలుగా పరిగణిస్తారని నిలదీశారు.

You might also like