FbTelugu

ప్రొద్దుటూరులో బైఠాయించిన నారా లోకేష్

కడప: టీడీపీ ముఖ్య నాయకుడు నందం సుబ్బయ్య హత్యకు నిరసనగా ఆ పార్టీ నాయకుడు నారా లోకేష్ ఆందోళన చేపట్టారు. సుబ్బయ్య మృతదేహం వద్ద ఆయన బైఠాయించారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, బంగారు రెడ్డి, స్థానిక మున్సిపల్ కమిషనర్ రాధపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత హత్యలు పెరిగిపోయాయని, హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నించినందుకే సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారని లోకేష్ ఆరోపించారు.

అంతకు ముందు లోకేష్ సుబ్బయ్య భార్య అపరాజితను పరామర్శించారు. హత్య ఎలా జరిగింది, ఎవరిపై అనుమానాలు ఉన్నాయని అడిగి తెలసుకున్నారు. పార్టీ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని, ఇద్దరు కుమారుల విద్యా బాధ్యతలను పార్టీ చూసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.
కడప టీడీపీ అధికార ప్రతినిధి, పద్మశాలీ నాయకుడు నందం సుబ్బయ్య (41) ను మంగళవారం ఉదయం ప్రొద్టుటూరు పట్టణ శివారు రామేశ్వరంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే స్థలంలో దారుణంగా చంపిన విషయం తెలిసిందే. కళ్లల్లో కారం చల్లి, రాడ్డుతో తలపై మోదీ దారుణంగా హత్య చేశారని భార్య అపరాజిత ఆరోపించింది. ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని వాట్సప్ లో ఉన్న కడప జిల్లా వార్తలు అనే గ్రూపులో వీడియో పోస్టు చేశారన్నారు. ఇది జరిగిన పావు గంటలోనే హత్య చేశారని అపరాజిత ఆరోపించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.