FbTelugu

సీఐడీని సోషల్ మీడియా వేధింపుల శాఖగా మార్చేశారు: లోకేష్

అమరావతి: సీఐడీని సోషల్ మీడియా వేధింపుల శాఖగా మార్చేశారంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాల అక్రమాల విషయంలో రాని సీఐడీ సోషల్ మీడియాపై పడిందని అన్నారు. వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా గళం ఎత్తుతున్నారని మరి వారిని కూడా సీఐడి అరెస్టు చేస్తుందా అని ప్రశ్నించారు.

 

You might also like