FbTelugu

ఈ పాపం నిన్ను ఊరికే వదలదు: లోకేశ్

అమరావతి: ప్రశాంతగా ఉన్న రాయలసీమలో రక్తం పారిస్తున్నారంటూ.. ఆ పాపం ఊరికే వదలదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ఏపీ సీఎంపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై నీ మదాన్ని అణిచేస్తాం జగన్.

ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నావ్. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు.నీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. చేనేత‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిని అత్యంత కిరాతకంగా హత్యచేసారు. మీ అవినీతిని ఎండగట్టినందుకు కక్షగట్టి టిడిపి జిల్లా అధికార‌ప్ర‌తినిధి నందం సుబ్బయ్యను ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారు.హత్య చేసిన ఎమ్మెల్యే,అతని బావమరిది బంగారురెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలి. వేట‌కొడ‌వ‌ళ్ల‌తో తండ్రిని న‌రికేయించావు. నువ్విచ్చే ప‌రిహారంతో అనాథ‌లైన ఆ పిల్ల‌ల‌కు తండ్రిని తేగ‌ల‌వా? జ‌గ‌న్‌రెడ్డీ’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.