అమరావతి: వరుస తుఫానుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతుల పట్ల నష్టపరిహారం అందించే విషయంలో ఈ -క్రాప్ లో ఎంటర్ కాలేదు కాబట్టి మీకు ప్రభుత్వ సహాయం రాదు అనడం దారుణమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ‘‘‘ఈరోజు నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గం పచ్చల తాడిపర్రు గ్రామంలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించాను. వరుస తుపాన్లు, వరదలు కారణంగా పూర్తిగా నష్టపోయామని, చెప్పారు’‘ అంటూ పేర్కొన్నారు.