FbTelugu

బలవంతపు ఏవకగ్రీవాలు జరగనివ్వొద్దు: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న పంచాయతి ఎన్నికల్లో బలవంతపు ఏవకగ్రీవాలు జరగనివ్వొద్దని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పంచాయతి ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.

ఎక్కడైనా వైసీపీ నేతలు ఘర్షణలకు దిగితే వీడియోలు తీసి పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. వీటిపై లిఖితపూర్వక ఫిర్యాదులతో రిటర్నింగ్ అధికారులకు అందించాలని తెలిపారు. టీడీపీ శ్రేణులు ధైర్యంగా నామినేషన్లు వేయాలని దిశానిర్ధేశం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.