FbTelugu

వకీల్ సాబ్ కాదు షకీలా సాబ్: మంత్రి నాని ఎద్దేవా

గుడివాడ: ప్యాకేజీలు తీసుకుని నేను ఎలా పడితే అలా మాట్లాడను, ప్యాకేజీ తీసుకుని మళ్లీ రోడ్ల మీద విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వేంకటేశ్వర రావు (నాని) విమర్శించారు.
నువ్వు వకీల్ సాబ్ అనుకుంటున్నావు, కాని జనం మాత్రం షకీలా సాబ్ అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జనసేన అధినేత, నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నాని ఇవాళ కౌంటర్ ఇచ్చారు. గుడివాడలో పేకాట క్లబ్బులు మూయించానా, ఆడిస్తున్నాననా అని ప్రశ్నించారు. పవన్ బోడి లింగ్ కావడం ప్రజలు కింద పడేశారన్నారు. బోడి లింగం ఎవరో గాజువాక, భీమవరం ప్రజలకు తెలుసని నాని చురక అంటించారు.

పవన్ సినిమాలు చేస్తే మాకేంటి, చేయకుంటే మాకేంటి అని అపహాస్యం చేశారు. నువ్వు ఒక యాక్టర్ మాత్రమేనని, తన సినిమాలో యాక్షన్ చూపించాలన్నారు. సినిమాలు మానేయ్యాలని మేమైనా చెప్పామా అన్నారు. ఆయనే మానేస్తున్నాను అని చెప్పారు, మళ్లీ ఆయనే మాటమార్చారని గుర్తు చేశారు. ఏపీలో తెలుగుదేశం, ప్రజా శాంతి పార్టీ, జనసేన పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ఆ ముగ్గురు కలిసి రాష్ట్రంలో తెలుగు శాంతి సేన పార్టీ పెట్టుకుంటే బాగుంటుందన్నారు. అంతర్జాతీయ పార్టీకి కేఏ పాల్, జాతీయ పార్టీకి చంద్రబాబు నాయుడు, ఏపీకి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉండాలని మంత్రి నాని హితవు పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.