FbTelugu

రష్యా జోరు అంతా ఇంతా కాదయ్యా…!

వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ వీ

మాస్కో: రష్యన్ దేశం తయారు చేసిన వ్యాక్సిన్ కు అప్పుడే డిమాండ్ పెరిగింది. సుమారు 20 దేశలు బిలియన్ డోసులు ప్రీ ఆర్డర్ చేశాయని రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ తెలిపారు.

అయితే వ్యాక్సిన్ కు పేరును ఖరారు చేశారు. స్పిత్నిక్ వీ అనే పేరు పెట్టినట్లు కిరిల్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలియచేస్తామని, తప్పుడు వివరాలను కూడా ఖండిస్తామన్నారు. బుధవారం నుంచి మూడో దశ ట్రయల్స్ ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు.

You might also like