హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తన నివాసం నుండి రోడ్డు మార్గం ద్వారా అమరావతి బయలుదేరారు.
చంద్రబాబు నాయుడు వెంట మాజీ మంత్రి లోకేష్, అసిస్టెంట్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం విమానంలో వెళ్లాల్సి ఉండగా విశాఖపట్నం, విజయవాడ ఏయిర్ పోర్టులు మూసివేయడంతో పర్యటన రద్దయింది. దీంతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వయా సూర్యాపేట మీదుగా విజయవాడకు బయలుదేరారు.