FbTelugu

నాయుడు… రూ.12 కోట్లు ముంచాడు

విశాఖపట్నం: శిరోమండనం కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్న బిగ్ బాస్ ఫేమ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని నూతన్ నాయుడు అక్రమాలు రోజుకొకటి చొప్పున బయటకు వస్తున్నాయి.

అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా తాజాగా మరో పెద్ద ఆర్థిక నేరం కేసు నమోదు అయ్యింది. ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద రూ.12 కోట్లు వసూలు చేశాడని మహారాణిపేట లో ఒకరు కేసు పెట్టారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రీజినల్ డైరెక్టర్ పదవి ఇప్పిస్తానని చెప్పి రూ.12 కోట్లు వసూలు చేశాడని బాధితుడు ఫిర్యాదు చేశాడు.

దీనిపై స్పందించిన డీసీసీ ఐశ్వర్య రస్తోగి మీడియాతో మాట్లాడుతూ, లోతైన విచారణ జరుపుతున్నామని, ఈ కేసులో మరోసారి నూతన్ నాయుడును కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు. సీఎం జగన్ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి పివి.రమేష్ కుమార్ పేరుతో పైరవీలు చేయడంపై ఇప్పటికే కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.

You might also like