FbTelugu

‘దివ్య హత్య కేసులో నాగేంద్ర వాదనలో నిజం లేదు’

విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్ర వాదనలో నిజం లేదని ఫొరెన్సిక్ నివేదిక తేల్చింది. వివరాల్లోకెళితే.. గత కొన్ని రోజుల క్రితం దివ్య అనే యువతిని నాగేంద్ర అనే యువకుడు కత్తితో పొడిచి తానూ పొడుచున్నాడు. దివ్య చనిపోగా.. నాగేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దివ్య తనకు తానుగా పొడుకున్నట్టుగా నిందితుడు తెలుపగా.. అందులో నిజం లేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దివ్యది హత్యేనని గాయాలు సొంతంగా చేసుకున్నవి కావని తేల్చారు. దీనిపై చార్జ్ షీట్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 28 న కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసే అవకాశం ఉంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే నాగేంద్రను అదుపులోకి తీసుకోనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.