FbTelugu

బిగ్ బాస్-4 లో నాగార్జున ట్రిఫుల్ రోల్

హైదరాబాద్: త్రిపాత్రాభినయంతో హీరో నాగార్జున బిగ్ బాస్-4 సీజన్ లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మేరకు స్టార్ మా టీవీ ఛానల్ బిగ్ బాస్-4 ప్రోమో లను రిలీజ్ చేసింది. మూడు తరాల పాత్రల్లో నాగార్జున ముందుకు వస్తున్నారు.

ఇంతకు ముందు ఒకసారి హోస్ట్ గా వ్యవహరించిన ఆయన తాజాగా రెండోసారి తెర ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల ముందుకు రావడం కోసం షూటింగ్ ఫ్లోర్ కు రావడం సరదాగా ఉందని నాగార్జున వ్యాఖ్యానించారు. గత సీజన్ గొప్ప విజయం అందుకున్నది. ఈ సీజన్ లో ప్రేక్షకులను ఆనందపర్చడంతో పాటు ఆశ్చర్యానికి గురి చేసే ప్రయత్నం ఉంటుందన్నారు. అయితే ఈసారి మూడు పాత్రలు చేయడం, ఆ పాత్రలకు తగ్గట్టుగా అభినయం చేయడం ఇంత తక్కువ సమయంలో చేయడం అతి పెద్ద సవాల్ అని నాగార్జున అన్నారు.

జీవితం, ఆశ, వినోదం ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకూడదని నేను బలంగా నమ్ముతున్నానని అన్నారు. ఈ ఏడాది మీకు బిగ్ బాస్ సీజన్ సంపూర్ణ వినోదాన్ని అందిస్తామని నాగార్జున తెలిపారు.

You might also like