FbTelugu

సాగర్ లో మద్దతివ్వండి… లెఫ్ట్ కు కాంగ్రెస్ లేఖ

హైదరాబాద్: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డికి మద్దతు పలకాల్సిందిగా పిసిసి నాయకత్వం ఉభయ కమ్యూనిస్టులకు లేఖలు రాసింది.
నాగార్జున సాగర్ లో విజయం సాధించి మరోసారి సత్తా చూపించాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. సిపిఐ, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శులకు పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కలు లేఖలు రాశారు.

జానారెడ్డికి మద్దతు ప్రకటించాలని వారు కోరారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరకుండా జానారెడ్డికి మద్దతు పలకాలని కోరడంలో కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ లోని కొందరు నాయకులు విమర్శిస్తున్నారు. వ్యక్తులను బట్టి పార్టీలో నిర్ణయాలు జరుగుతున్నాయని, పార్టీ ప్రయోజనం కోసం జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.