FbTelugu

నాగార్జున సాగర్ 18 గేట్లు ఎత్తివేత

నల్లగొండ: గత మూడు రోజులుగా నాగార్జున సాగర్ కు వరద భారీగానే వస్తోంది. దీంతో సాగర్ 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ లోకి ఇన్ ఫ్లో 2.96 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.

దిగువకు 2.64 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 587.80 అడుగులు ఉంది.

You might also like