హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జున ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ పై కన్నెర్ర చేశారు. యాపిల్ సేవలు ఏకపక్షంగా ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కంపెనీ సేవల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నాగార్జున సూచించారు. భారత్ లో యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేసే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, వాళ్ల సేవలు, విధానాలు ఏకపక్షంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇది దారుణం, ఘోరమైన చర్య అని నాగ్ ట్వీట్ చేశారు. ఏ కారణంతో ఆగ్రహం వ్యక్తం చేసింది మాత్రం నాగార్జున వెల్లడించలేదు. ప్రస్తుతం నాగార్జున్ వైల్డ్ డాగ్ తో పాటు, బ్రహ్మస్త్ర లోనూ నటిస్తున్నారు.