FbTelugu

నాగ‌బాబు కామెంట్స్ ఆంత‌ర్యం ఏమి కావ‌చ్చు!

మెగా ఫ్యామిలీలో భిన్న స్వ‌రూపాలు. కానీ తామంతా కుటుంబ‌ప‌రంగా ఏక‌రూప‌మ‌ని చెప్పేందుకు ప‌లుమార్లు ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంది.

జ్యోతిచిత్ర‌, సితార కాలంలో గాసిప్స్ కేవ‌లం ఆ పుస్త‌కాలు చ‌దివే వాళ్ల‌కో.. లేక‌పోతే కాకా హోట‌ళ్లు.. సిని అభిమానుల మ‌ధ్య మాత్ర‌మే ఉండేవి. ఇప్పుడు అలా కాదు… సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ అవుతూ… అర‌క్ష‌ణంలో విశ్వాన్ని చుట్టొస్తుంది. అందుకే.. వాస్త‌వాలు.. పుకార్లు ఒకేస‌మ‌యంలో చెవుల‌ను తాకుతుంటాయి. నిజాలు కాస్త చేదుగా ఉంటాయి.

వ‌దంతులు వేడిగా ఉంటాయి కాబ‌ట్టి రుచిగా ఉంటాయి.. మెగా మ‌ధ్య ‌బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గాంధీను హ‌త్య‌చేసిన గాడ్సేను దేశ‌భ‌క్తుడు అంటూ స‌మ‌ర్ధించ‌టం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదంతా ఎందుకు అనాల్సి వ‌చ్చింద‌నే వివ‌ర‌ణ కూడా ఇచ్చారాయ‌న‌. గాంధీ ప‌ట్ల యావ‌త్ భార‌తీయులు భిన్న వాద‌న‌లు వినిపిస్తుంటారు. భ‌గ‌త్‌సింగ్‌, చంద్ర‌శేఖ‌ర్ అజాద్‌, సుభాష్ ‌చంద్ర‌బోస్ వంటి అతివాదుల స్వాతంత్ర కీర్తిని అంతా తానే నింపుకున్న గాంధీ స్వార్ధ‌బుద్దికి ప‌రాకాష్ట అని విమ‌ర్శ‌లు చేసే వారూ లేక‌పోలేదు.

అంత ‌మాత్రాన గాంధీ అహింస సిద్ధాంతాన్ని ఎవ్వ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. కానీ.. స్వాతంత్ర స‌మ‌రంలో ల‌క్ష‌లాది మంది పోరాట‌యోధుల‌ను ప‌క్క‌న‌బెట్టి కేవ‌లం గాంధీ, నెహ్రు కుటుంబాల‌కు మాత్ర‌మే తెర‌మీద‌కు తీసుకురావ‌ట‌మే రుచించ‌ని అంశం. ఇప్పుడెలాగూ.. దేశంలో హిందుత్వ వాదం బ‌లంగా వినిపిస్తుంది. న‌రేంద్ర‌మోదీ హ‌యాంలో ఎన్డీఏ రెండోద‌ఫా సునాయాసంగా విజ‌యం సాధించ‌టానికి కార‌ణం కూడా దేశంలో హిందుత్వ ఎజెండా నెమ్మ‌దిగా రావ‌టం కూడా కార‌ణ‌మే. ఇప్పుడెందుకీ చ‌ర్చ అనేదానికి నాగ‌బాబు కేంద్ర‌మ‌య్యారు. స్వ‌త‌హాగా నాగ‌బాబు ప‌రిణితితో మాట్లాడ‌తారు.

అదే స‌మ‌యంలో ఆవేశంపాళ్లు కూడా ఎక్కువే కావ‌టంతో బావోద్వేగాల‌ను నియంత్రించుకోలేక త‌ర‌చూ ఇలా నోరు జారుతుంటారు. ఇప్పుడున్న క‌రోనా కాలంలో మైనార్టీల‌ను క‌రోనా వ్యాప్తి కార‌కులుగా భావిస్తూ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతుంది. ఇటువంటి సున్నిత‌మైన స‌మ‌యంలో గాడ్సే జ‌యంతి రోజున యాదృచ్ఛికంగా స్పందించినా.. దీని వెనుక నాగ‌బాబు ఎజెండా.. హిందుత్వాన్ని తాను అనుస‌రిస్తున్నాన‌ని చెప్ప‌టం బీజేపీలోని ఓ వ‌ర్గానికి ద‌గ్గ‌ర కావ‌టం కూడా కావ‌చ్చు. ఎందుకంటే.. జ‌న‌సేన త‌ర‌పున గొంతు విప్పుతున్న నాగ‌బాబు స‌మ‌యాన్ని చ‌క్క‌గా వాడుకున్నాడు. దీనితాలూకూ ఎదుర‌య్యే చేదు అనుభ‌వాల కంటే.. రాబోయే రోజుల్లో తీపిఫ‌లాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్టుగానే ఈ కామెంట్స్‌ను అర్ధంచేసుకోవాల‌నేది మిత‌వాదుల అంత‌రంగం.

You might also like

Leave A Reply

Your email address will not be published.