FbTelugu

మళ్లీ లాక్ డౌన్… చారిత్రక తప్పిదం: నాగబాబు

మరోసారి లాక్ డౌన్ విధించే నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దని, మళ్లీ లాక్ డౌన్ విధిస్తే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు అభిప్రాయపడ్డారు.
ప్రజలందరూ 90 రోజుల పాటు తమ జీవితాలను వదిలేశారు. వలస కార్మికుల వెతలు చెప్పనలవి కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ ప్రకటించి, ప్రజల జీవితాలను స్తంభింపచేస్తే అది చారిత్రక తప్పిదం అవుతుందన్నారు. ఏ రాష్ట్రం అయినా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సరిదిద్దుకోలేని తప్పుగా మిగిలిపోతుందన్నారు.

చాలా దేశాలు లాక్ డౌన్ లేకుండానే కరోనాను ఎదుర్కొంటున్నాయి. కరోనాతో చస్తే చచ్చాం… మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి అనేంతగా తిరుగుబాటు భావాలు ప్రజల్లోకి కలగడం సరికాదని వ్యాఖ్యానించారు. 90 రోజుల లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్లలో ఉండడం ద్వారా తమ బాధ్యత నిర్వర్తించారని అన్నారు. లాక్ డౌన్ తో తమ జీవితాలను వదిలేసుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వాలు తమ బాధ్యత నెరవేర్చాల్సిన సమయం వచ్చిందని నాగబాబు స్పష్టం చేశారు.

You might also like