FbTelugu

14 నుంచి ‘నాడు-నేడు’ కార్యక్రమం: జగన్

nadu-nedu-program-starts-From-14th-november-says-jagan

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 45వేల పాఠశాలల్లో ఈ నెల 14 నుంచి ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిది రకాల పనులను చేపట్టనున్నట్టు తెలిపారు.

ప్రతి పాఠశాలలోనూ మరుగుదొడ్లు, కాంపౌండ్‌వాల్‌, తాగునీరు, నీటి పారుదల, ఫర్నిచర్‌, ఫ్యాన్లు, బ్లాక్‌ బోర్డులు, లైటింగ్‌, పెయింటింగ్‌.. తదితర సౌకర్యాల ఏర్పాటును పరిశీలించి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి.. ఇకపై ఎలా ఉండాలి.. అనే విషయంపై దృష్టి పెడతాం అని జగన్‌ స్పష్టం చేశారు.

You might also like